గోపాలపురం: ఈనెల 30వ తేదీ మెగా రక్తదాన శిబిరం

3చూసినవారు
గోపాలపురం: ఈనెల 30వ తేదీ మెగా రక్తదాన శిబిరం
గోపాలపురం మానవతా స్వచ్ఛంధ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీ బుధవారం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ జొన్నలగడ్డ రాంబాబు, జిల్లా మానవతా సంస్థ రక్త నిధి డైరెక్టర్ జోడాల వెంకట్, గోపాలపురం మానవతా సంస్థ అధ్యక్షులు రాపాక ఫణి కిషోర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణదానంతో సమానం అని 18 సంవత్సరాలు నిండిన మరియు 50 కిలోల బరువు ఉన్న యువతీ యువకులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని అన్నారు.

సంబంధిత పోస్ట్