గోపాలపురం మండలంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమై, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మండలంలో 53.0 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైందని ఏఎస్ఓ జోడాల వెంకటేశ్వరరావు శుక్రవారం తెలిపారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.