గోపాలపురం మండలంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తహశీల్దార్ కే. అజయ్ బాబు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 5న జరిగే ఈ ఎన్నికకు పట్టిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు. 4న రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నట్లు తెలిపారు. అర్హులైన వారు ఓటును వినియోగించుకోవాలని ఆయన కోరారు.