గోపాలపురం: సమస్యల పరిష్కారానికి గ్రామదర్శిని

82చూసినవారు
గ్రామాలలోని సమస్యల పరిష్కారానికి గ్రామదర్శిని కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పేర్కొన్నారు. గురువారం గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల మండలం రాజుపాలెంలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రామస్తులతో మమేకమై ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అలాగే గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు.

సంబంధిత పోస్ట్