తాళ్లపూడి మండలంలో తెల్లవారుజామున నుండి మోస్తారు వర్షం కురుస్తుంది. ఈ గ్రామాల్లో గజ్జూరం, ప్రక్కిలంక, బల్లిపాడు, ఎడతెరిపి లేకుండా ఏకధాటిగా ఆదివారం తెల్లవారుజాము నుండి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయామయ్యాయి. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు మూడు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.