గోపాలపురం మండలం కొవ్వూరుపాడుకి చెందిన మనుపూడి దుర్గ కాన్సర్ తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిరు పేద కుటుంబం కావడంతో కుటుంబమంతా వైద్యానికి ఉన్నదంతా ఖర్చు చేసి కీమోధెరపికి డబ్బు లేని పరిస్థితి ఏర్పడడంతో దుర్గ భర్త నాయకులను సంప్రదించగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు తక్షణమే స్పందించి 5 గంటలలోగా LOC చేయించి 3, 50, 000 మంజూరు చేయించి బుధవారం సాయంత్రం కుటుంబ సభ్యులకు చెక్కును అందచేశారు.