యువకుడి చికిత్సకు ఎమ్మెల్యే మద్దిపాటి చేయూత

66చూసినవారు
యువకుడి చికిత్సకు ఎమ్మెల్యే మద్దిపాటి చేయూత
దేవరపల్లి మండలం బుచ్చిపాలెంలోని పలాంట్ల ధర్మరాజు అనే యువకుడికి ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అండగా నిలిచారు. హార్ట్ సర్జరీ చేయించుకునేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఎమ్మెల్యేను కలిశారు. ఆయన వెంటనే స్పందించి సీఎం సహాయనిధి నుంచి
రూ. 4లక్షల చెక్కు మంజూరు చేయించారు. గురువారం రాత్రి ధర్మరాజుకు ఆ చెక్కును అందజేశారు.

సంబంధిత పోస్ట్