కలెక్టర్ ప్రశాంతి ని కలిసిన ఎమ్మెల్యే మద్దిపాటి

77చూసినవారు
కలెక్టర్ ప్రశాంతి ని కలిసిన ఎమ్మెల్యే మద్దిపాటి
తూర్పుగోదావరి జిల్లా నూతన కలెక్టర్ పి. ప్రశాంతిని శనివారం గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గానికి సంబంధించిన పలు విషయాలు ఇరువురు చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్