నల్లజర్ల మండలం అనంతపల్లిలో ఆదివారం జరిగిన రోడ్డు ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆగి ఉన్న కారును బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నల్లజర్లకు చెందిన నీరుకొండ ప్రసాద్ గాయపడ్డాడు. జాతీయ రహదారి అంబులెన్స్ సిబ్బంది తక్షణమే స్పందించి బాధితుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.