నల్లజర్ల జాతీయ రహదారిపై ఎర్రకాలువ బ్రిడ్జి వద్ద సబ్బుల లోడుతో వెళ్తున్న వ్యాన్ శుక్రవారం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది, నల్లజర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు.