గోపాలపురం మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన యశశ్రీ క్రికెట్ క్రీడలో సత్తా చాటుతుంది. ఇటీవల నిర్వహించిన అండర్ 15 సెలక్షన్స్ లో సెలెక్ట్ అయ్యి ప్రస్తుతం మంగళగిరిలో మ్యాచ్లు ఆడుతుంది. చిన్ననాటి నుండి క్రికెట్ పై మక్కువ కలిగిన బాలిక ఆసక్తిని చూసి తండ్రి తనింకి సత్తిబాబు వెన్నంటే ప్రోత్సహించారు.