గోపాలపురం మండలంలోని భీమోలు గ్రామంలో ఆదివారం కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు జరిపామని ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు. ఈ దాడిలో ఏడుగురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామన్నారు. 2 కోడి పుంజులు, 2 కోడి కత్తులు, రూ. 14, 500 నగదు, 12 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామని చెప్పారు. కోడి పందేలు, నాటుసారా వంటి వాటిని సహించేది లేదని ఆయన హెచ్చరించారు.