దేవరపల్లి మండలం పల్లంట్లలో ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ ఇంజనీర్ నారాయణప్పారావు శుక్రవారం తెలిపారు. ఆర్ఎఎస్ఎస్ పనులు, 11 కేవీ బైఫరికేషన్, కొత్త ఫీడర్, పోల్స్ ఏర్పాటు కోసం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ కరెంటు ఉదయం 4 నుంచి 9 గంటల వరకు అందుతుందని వివరించారు.