ఏలూరు ద్వారకా తిరుమల శ్రీ వకుళామాత నిత్యాన్నదాన ట్రస్ట్‌కు భీమవరం మందలపర్రుకు చెందిన పాతూరి నాగ రామకృష్ణారాజు దంపతులు ఆదివారo రూ. 4 లక్షలు విరాళంగా సమర్పించారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ ఈవో వేండ్ర త్రినాధరావు దాతలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి విరాళ బాండ్ పత్రాలను, ప్రసాదాలను అందించారు.