గోపాలపురం మండలం దొండపూడి గ్రామంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని ఉదయం నుంచి భక్తులు కోదండరాములవారిని దర్శించుకున్నారని ఆలయ పురోహితులు సుబ్రహ్మణ్య శర్మ తెలియజేశారు. అలాగే ఏకాహం కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. దర్శనార్థం వచ్చే భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించినట్లు అందరికీ ప్రసాదాలు పంచిపెట్టినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు.