తూ.గో: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

56చూసినవారు
తూ.గో: విద్యుత్ షాక్‌తో రైతు మృతి
నల్లజర్ల మండలంలోని సుభద్రపాలెం గ్రామంలో దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీనివాస్ (35) పామాయిలు గెలలు కోస్తుండగా అనుకోని విధంగా విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న నల్లజర్ల పోలీసు స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్