కొత్తిమీర ధర ఆకాశాన్నింటింది. గతంలో 1 కట్ట ధర రూ. 10 పలుకుగా ప్రస్తుతం రూ. 30గా ఉంది. జిల్లాలో ప్రధానంగా ఉండ్రాజవరం, పెరవలి, కొవ్వూరు, నిడదవోలు గోదావరి పరివాహక ప్రాంతం, లంక భూముల్లో సుమారు 80 ఎకరాల్లో రైతులు పండిస్తున్నారు. వాతావరణం అనుకూలంగా ఉండడంతో, 45 రోజుల్లో పంట చేతికి రావడంతో ఎక్కువగా పండిస్తున్నారు. దీంతో దిగుబడి బాగానే ఉన్నప్పటికీ ధర మాత్రం ఆకాశాన్ని అంటి సామాన్యులకు భారంగా మారి కొనలేని పరిస్థితి ఏర్పడిందని వినియోగదారులు వాపోతున్నారు.