దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో "బాబు షూరిటీ-మోసం గారంటీ ' కార్యక్రమం శనివారం నిర్వహించారు. వైసీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపాలపురం వైసీపీ ఇన్చార్జ్ తానేటి వనిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని అన్నారు. నిరుద్యోగులను మోసం చేసిందని ఎద్దేవా చేశారు.