ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు జగ్గంపేట మండలంలో సుమారు 400 ఎకరాలలో వరి పంట నీట మునిగింది. జగ్గంపేట మండలంలోని రామవరం గ్రామంలో నీట మునిగిన వరి పంటలను తహసీల్దార్ జెవీఆర్ రమేష్, మండల వ్యవసాయాధికారి ఆర్. శ్రీరామ్ బుధవారం సందర్శించి రైతులకు తగిన సూచనలు చేశారు. వరి నాట్లు వేసి 20 నుంచి 40 రోజులు అయినందున నీరు బయటకు పోయేలా చర్యలు తీసుకోవాలని రైతులకు ఏవో సూచించారు.