గోకవరం మండలం కృష్ణునిపాలెంలో గురువారం 'అంగన్వాడీ పిలుస్తోంది రా' కార్యక్రమం నిర్వహించారు. వేసవి సెలవుల తర్వాత ప్రారంభమయ్యే కొత్త విద్యాసంవత్సరాన్ని పురస్కరించుకుని చిన్నారులను అంగన్వాడీల్లో చేర్పించడమే దీని ఉద్దేశ్యమని మండల సూపర్వైజర్ ఇందిర తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.