జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కంటి వైద్య శిబిరాన్ని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి పడాల వీర వెంకట సత్యనారాయణ, గుర్రంపాలెంగ్రామ టిడిపి నాయకులు పడాల రాంబాబు రిబ్బన్ కట్ చేసి ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. రాజేశ్వరి రామకృష్ణన్ లయన్స్ నేత్ర వైద్యశాల వారు ఆదివారం ఉదయం 9 గంటల నుండి ఒంటిగంట వరకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.