వరి నాట్లు వేసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను శంఖవరం అగ్రికల్చర్ ఆఫీసర్ గాంధీ రైతులకు వివరించారు. శంఖవరం గ్రామంలో శనివారం వరి నాట్లు వేసే పొలాలను ఆయన పరిశీలించారు. వరి ఆకులు కాళీకాళీగా ఉంచడం వలన పంటకు గాలి వెలుతురు తగిలి పిలకలు ఎక్కువగా వేస్తాయని సూచించారు. చీడ పీడలు కూడా బాగా తగ్గుతాయని అధిక దిగుబడులు సాధించవచ్చని సూచించారు. దాదాపు 10, 000 ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారని తెలిపారు.