గోకవరం: కలకలం రేపిన తాబేళ్ల మూటలు

85చూసినవారు
గోకవరం: కలకలం రేపిన తాబేళ్ల మూటలు
గోకవరం పోలీస్‌ స్టేషన్‌ దగ్గర్లో తాబేళ్ల మూటలు శనివారం కలకలం రేపాయి. గుర్తు తెలియని దుండగులు తాబేళ్లను సంచుల్లో మూటలుగా కట్టి  పీఎస్‌ ఎదుట వదిలిపెట్టి పరారైనట్లు తెలస్తోంది. ఆ బస్తాల్లో సుమారు 250 వరకు తాబేళ్లను పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. తాబేళ్లు ఎక్కడివి, ఎందుకు ఇలా మూట కట్టారు అనే అంశంపై అటవీ శాఖ అధికారులు విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్