జగ్గంపేట మండలం మామిడాడలో సోమవారం పోలీసులు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేరాల నుంచి దూరంగా ఉండేందుకు తగిన సూచనలు అందించారు. హెల్మెట్ వాడకం, డ్రగ్స్ వినియోగంతో వచ్చే అనర్థాలు, శక్తి యాప్ ఉపయోగాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ రఘునందన్ రావు పాల్గొన్నారు.