జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ 27 మందికి సిఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్యానికి ఆర్థిక స్తోమత లేని బాధితులు సాయం కోసం దరఖాస్తు చేసుకోగా రూ.25,22,204 సీఎం ఆర్ఎఫ్ కింద మంజూరు కాగా వాటిని బాధితులకు అందజేశారు.