ఆధునిక యంత్రాలతో తక్కువ సమయం, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. శుక్రవారం కిర్లంపూడి ఏవో మాధురి అధ్యక్షతన కిసాన్ డ్రోన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని రైతులకు డ్రోన్ పంపిణీ చేశారు. ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందిస్తున్న ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.