జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మార్చి 18వ తేదీన మినీ జాబ్ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం. కొండలరావు, కాలేజీ ప్రిన్సిపాల్ డి. చిన్నారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన 19- 35 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా https: //naipunyam. ap. gov. in వెబ్ సైట్ నందు పూర్తి వివరాలతో రిజిస్టర్ కావాలన్నారు.