జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆదివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రజల నుంచి వచ్చిన అనేక వినతులను స్వీకరించారు. మన్యంవారిపాలెం గ్రామానికి చెందిన మునువర్తి వీర్రాజు తన స్థల సమస్యపై వినతిపత్రం సమర్పించగా, సమస్యను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామీణ నాయకులు పాల్గొన్నారు.