నూతనంగా జారీ చేసే రేషన్ కార్డులకు వివాహ రిజిస్ట్రేషన్ ద్రువపత్రం లేకున్నా కొత్త కార్డులు మంజూరు చేస్తారని కూటమి నాయకులు వెల్లడించారు. గురువారం స్థానిక టీడీపీ కార్యలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, మండల అధ్యక్షులు మారిశెట్టి భద్రం మీడియా సమావేశం నిర్వహించారు. వీఆర్వో సర్టిఫై చేస్తే సరిపోతుందని వివరించారు. ప్రభుత్వం ట్రాన్స్ జెండర్లకూ కొత్త కార్డులు జారీ చేస్తుందని అన్నారు.