కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని మల్లిశాల, కాట్రావులపల్లిలను జగ్గంపేట సిఐ ఎక్సైజ్, సీఐ టీములు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. మంగళవారం ఎక్సైజ్ సీఐ అర్జున్ రావులు తనిఖీలు నిర్వహించారు. కాట్రావులపల్లిలో డ్రమ్ములలో అక్రమంగా నిల్వ ఉంచిన బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. డ్రమ్ములను ధ్వంసం చేశారు. కె.వి.వి. దుర్గా, అర్జునరావు, చిట్టి బాబు, ప్రసాద్ ఎస్ఐలు సిబ్బంది సత్యనారాయణ పాల్గొన్నారు.