జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలోని పీహెచ్సీలో డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో గ్రామంలోని ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామ టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు అన్నారు. కాకినాడలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ జె. నరసింహ నాయక్ ను శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. వెంటనే స్పందించిన ఆయన ఇద్దరు వైద్యాధికారులను నియమించేందుకు చర్యలు తీసుకున్నట్లు నాగేశ్వరరావు మీడియాకు తెలిపారు.