ఈనెల 12వ తేదీ నుంచి వేసవి సెలవులు అనంతరం పాఠశాలలో తిరిగి ప్రారంభమవుతున్న తరుణంలో జగ్గంపేట ఎస్సై రఘునాథరావు ఆధ్వర్యంలో మండల పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల వాహన డ్రైవర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐ వైఆర్కే మాట్లాడుతూ స్కూల్ పిల్లల సేఫ్టీ, సెక్యూరిటీ, భద్రత గురించి ఆటో డ్రైవర్లకు వివరించారు.