అమ్మ ప్రేమను చూపించే అంగన్వాడి కేంద్రాలకు 3 నుండి 5 ఏళ్ల చిన్నారులను పంపించాలని రాజపూడి గ్రామ సర్పంచ్ బూసాల విష్ణుమూర్తి, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి రేఖా బులిరాజు తల్లులను కోరారు. రాజపూడి సెక్టార్ సూపర్ వైజర్ అమ్మాజీ ఆధ్వర్యంలో మంగళవారం అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి ఇంటింటికి ప్రచారం చేసి అంగన్వాడీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.