గండేపల్లి మండలం రామేశంపేటలో ప్రైవేట్ హాస్టల్స్ పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జగ్గంపేట సిఐ శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థుల విలువైన సామాగ్రి భధ్రతపై హాస్టళ్ల చుట్టుపక్కల ఉన్న స్థలాలపై మంగళవారం రాత్రి డ్రోన్ ద్వారా నిఘా పెట్టారు. హాస్టల్ యాజమాన్యాలకు ఆయన పలు సూచనలు చేశారు. హాస్టళ్లు చుట్టుపక్కల లైటింగ్ ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. మాదకద్రవ్యాలపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలన్నారు.