ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తాపడి 9 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలైన ఘటన మంగళవారం కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో జరిగింది. జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామంలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తాపడింది. ఆ సమయంలో 13 మంది విద్యార్థులు బస్సులో ఉండగా 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.