టీడీపీ యువ నాయకుడు జాస్తి వసంత్ రూపొందించిన సుపరిపాలనలో తొలి అడుగు ప్రచార వాహనాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ లు ఆదివారం ప్రారంభించారు. నాలుగు రోజుల్లో 3, 000 మందిని కలుసుకున్నామని, ప్రజల అభిప్రాయాలతో భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తున్నామని నేతలు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.