జగ్గంపేట మండలం వెంగయ్యమ్మపురంలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావు సిబ్బందితో శనివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 5050 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి సోమవారం కోర్టుకు హాజరు పరచడం జరుగుతుందన్నారు.