జగ్గంపేట: అసంపూర్తి రోడ్డుతో తప్పని అవస్థలు

74చూసినవారు
జగ్గంపేట: అసంపూర్తి రోడ్డుతో తప్పని అవస్థలు
జగ్గంపేట మండలం రామవరం నుంచి మర్రిపాక వెళ్ళే రోడ్డును అసంపూర్తిగా నిర్మించడంతో వాహనదారులు, గ్రామస్థులు అవస్థలు పడుతున్నారని ప్రత్తిపాడు మండలం శంకర్లపూడి మాజీ ఉప సర్పంచ్ ఏపూరి శ్రీనివాస్ బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. రామవరం హైవే నుంచి పోలవరం కాలువ వరకు రూ. 84 లక్షలతో సీసీ రోడ్డు నిర్మిస్తున్నారు. అయితే 30 మీటర్లు రోడ్డు పూర్తి చేయకుండా వదిలేశారని, వెంటనే రోడ్డు పూర్తి చేయాలని ఉప సర్పంచ్ కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్