జగ్గంపేటలో ఆదివారం వైసీపీ నేతలు “జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం” అంటూ సర్వే పుస్తకాలను ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగగా, ముద్రగడ పద్మనాభం, దాట్ల సత్యనారాయణ రాజు, గిరిబాబు, దొరబాబు, వంగా గీత తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ఏడాది పాలనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ప్రచారం ప్రారంభించారు.