కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో శనివారం గ్రామ పెద్దలకు అవగాహన సదస్సు నిర్వహించారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు ముఖ్య అతిథిగా, జగ్గంపేట సీఐ వైఆర్ఎక్స్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. సైబర్ నేరాలు, శక్తి యాప్, డ్రగ్స్, సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.