ప్రత్తిపాడు వివేకానందస్వామి విగ్రహం ఎదురుగా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఇంట్లో మంగళవారం పట్టపగలే చోరీ జరిగింది. 15 తులాల బంగారం, మూడు కేజీల వెండి, లక్ష రూపాయల నగదు అపహరించినట్లు సమాచారం. సీఐ బి.ఎస్. అప్పారావు, ఎస్సై ఎస్. లక్ష్మి కాంతం చోరి జరిగిన ప్రదేశానికి క్లూస్ టీంతో చేరుకుని దర్యాప్తు చేపట్టారు.