కిర్లంపూడి మండలంలోని బూరుగుపూడి పుష్కర్ కెనాల్ వద్ద కోడిపందాలు నిర్బంధాలు లేకుండానే జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి రోజూ కోడిపందాలు నిర్వహిస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. దీనిపై అధికారులు పోలీసులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.