కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా నియమించారు. ఈ మేరకు శనివారం రాత్రి వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ముద్రగడ గత కొంతకాలంగా పార్టీలో చురుగ్గా ఉన్నారు. ఆయన తనయుడు గిరి పత్తిపాడు వైసీపీ కో-ఆర్డినేటర్ గా ఉన్నారు. ముద్రగడకు వైసీపీలో కీలక స్థానం దక్కిందని ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.