కిర్లంపూడిలో డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ 134వ జయంతి వేడుకలను మాజీ మంత్రి, వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం, గిరిబాబు నేతృత్వంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళులు అర్పించారు. అంబేడ్కర్ సేవలను ముద్రగడ స్మరించుకున్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం మానవజాతికి దిక్సూచి అని సూచించారు.