జగ్గంపేటలో నూతన ఇండస్ట్రియల్ పారిశ్రామిక భవనం

83చూసినవారు
జగ్గంపేటలో నూతన ఇండస్ట్రియల్ పారిశ్రామిక భవనం
జగంపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కాలేజీ ఎదురుగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ నూతన ఇండస్ట్రియల్ పారిశ్రామిక భవనం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. శనివారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శంఖుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నెహ్రూ అధికారులను వెంట బెట్టుకుని ఆ ప్రాంతాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు హాజరవుతారని ఎమ్మెల్యే నెహ్రూ తెలిపారు.

సంబంధిత పోస్ట్