రామన్నపాలెం: గుండెపోటుతో ఆటవీశాఖ ఉద్యోగిని మృతి

55చూసినవారు
రామన్నపాలెం: గుండెపోటుతో ఆటవీశాఖ ఉద్యోగిని మృతి
గుండెపోటుకు గురై ఆటవీశాఖ ఉద్యోగిని మృతి చెందారు. అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం రామన్నపల్లికి చెందిన కె. శ్రీదేవి(45) అదే మండలంలోని దేవారం బీటు అధికారిణిగా పనిచేస్తున్నారు. ఆమె గోకవరం మండలం రామన్నపాలెంలో నివాసం ఉంటున్నారు. విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన ఆమె మంగళవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపొటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్