కిర్లంపూడి మండలం సోమవరం గ్రామంలో సోమవరం ఎత్తిపోతల పథకం పునరుద్ధరించి బుధవారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా పంప్ హౌస్ కు రిబ్బన్ కట్ చేసి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రైతులందరికీ నీరు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని 1962 నుంచి నిర్విరామంగా పనిచేస్తున్న పంపింగ్ స్కీం ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే అది సోమవరం పంపింగ్ స్కీం అని అన్నారు.