గర్భస్థ శిశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని జగ్గంపేట పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ భాగ్యలక్ష్మి అన్నారు. జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గురువారం ఐసీడీయస్, వైద్యఆరోగ్యశాఖ, పోలీసు సిబ్బందికి లింగ నిర్ధారణ నిషేధచట్టం, ఇతర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగ్గంపేట సీడీపీవో పూర్ణిమ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.