స్వచ్ఛమైన పర్యావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి

58చూసినవారు
స్వచ్ఛమైన పర్యావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి
స్వచ్ఛమైన పర్యావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత మనదని జిల్లా అటవీ సంరక్షణ అధికారి ఎస్. భరణి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం కాకినాడ శ్రీనగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి, సైన్స్ సిటి ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ విబివి. ఆర్ చారిటబుల్ ఫౌండేషన్, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్