కాకినాడ జిల్లాలో ఉన్న సంక్షేమ హాస్టలకు నూతన భవనలు నిర్మించాలనిఎస్ఎఫ్ఐ కాకినాడ నగర అధ్యక్ష,కార్యదర్శులు సంజయ్,వాసుదేవ్ పేర్కొన్నారు.శనివారం సాయంత్రం జిల్లా బీసీ వెల్ఫేర్ డిడి ఎం.వల్లి కి ఎస్ ఎఫ్ ఐ నాయకులు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హాస్టల్ మౌళిక సౌకర్యాలు కల్పించాలని,పెండింగ్లో ఉన్న మెస్,కాస్మెటిక్ చార్జీలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.